ఒక్క సారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి (2)
మ్రొక్కెదాను కోర్కె తీర్చు మోహన కృష్ణుని రాణి || ఒక్క||
1. పందిట ముగ్గులు వేసి పచ్చల తోరణమే కట్టి, పచ్చల పీఠమునందు పరగ నిన్నే ధ్యానించెదను || ఒక్క ||
2. రాట్నమూన నూలు తీసి రమణిరో నే పడుగువేసి (2) పేటు ఘళ్ళు వేసి నేసి పెట్టితిని పట్నం పో రాణీ || ఒక్క ||
3. ఆటకాంబరు రాణివమ్మా, అరమర నీకేల నమ్మా (2) ఆదిశక్తి శంకరీ మమ్మాదరించి బ్రోవవె తల్లీ || ఒక్క ||
4. ఆటకాపత్రాన నుంచి అగరు నేనత్తరుంచి, తేటమైన వేడి నీరు తెచ్చి ఉంచినాను తల్లీ ||ఒక్క||
5. దేశభక్తులైన స్త్రీలు దేవి నిన్నే ధ్యానించెదరు, దోషములు ఎంచకమ్మా, దోషములు బాపవె తల్లీ || ఒక్క ||

No comments:
Post a Comment