ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి
సద్గుణ వల్లీ, హారతీ గొనుమా తల్లీ
హృదయ కమలమునందు నుంచి పూజించిన (2)
కొంచము దయ రాదుగా, కంచి కామాక్షమ్మరో వేగ హారతీ గొనుమా తల్లీ
స్నానాము చేయింతు చాలాగ పన్నీట (2),
జ్ఙానాంబరో రమ్మీ, జననీ వినుమా జాగేలనమ్మా,
హారతీ గొనుమా తల్లీ
పసుపు కుంకుమ పచ్చనక్షతల తో నిన్ను (2)
పసుపు కుంకుమ పచ్చనక్షతల తో నిన్ను (2)
బాగూగ పూజించెద ,బాల ఇల జాలములేల,
హారతీ గొనుమా తల్లీ
మల్లెలు మొల్లలు మంచి సంపెంగలు (2),
మల్లెలు మొల్లలు మంచి సంపెంగలు (2),
కొల్లలుగ పూజించెద, కొలచి తలచి పిలుచుచునుంటి, హారతీ గొనుమా తల్లీ
కండ చక్కెర, తేనె, కదళీన ఫలములు (2),
కండ చక్కెర, తేనె, కదళీన ఫలములు (2),
కామాక్షి అర్పించెద, కాలమీల గడుపుటలేలా
హారతీ గొనుమా తల్లీ
మహ దేవి రాణిరో, మహ నైవేద్యమ్మిదిగో (2)
మంత్ర పుష్పములివిగో, మాతా నన్ను నీ తావు చేర్చుకొ
హారతీ గొనుమా తల్లీ
ఎల్ల వేళలను ఈ మల్లికాంబను బ్రోచె (2),
మహ దేవి రాణిరో, మహ నైవేద్యమ్మిదిగో (2)
మంత్ర పుష్పములివిగో, మాతా నన్ను నీ తావు చేర్చుకొ
హారతీ గొనుమా తల్లీ
ఎల్ల వేళలను ఈ మల్లికాంబను బ్రోచె (2),
తల్లివీవే కావా, కల్యాణీరో కనులెత్తి చూడు ,
హారతీ గొనుమా తల్లీ,
తల్లీ తల్లీ సద్గుణ వల్లీ,హారతీ గొనుమా తల్లీ
ఈ పాట విని, నేర్చుకోని పాడుకోండి

