Wednesday, January 6, 2016

ఎంత చక్కని తల్లి ఎవరే ఓయమ్మా



ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి


ఎంత చక్కని తల్లి ఎవరే ఓయమ్మా
ఎంత ముద్దుల తల్లి ఎవరే ఓయమ్మా
ఇంతి విశ్వేశ్వరుని ఇల్లాలే కొమ్మా
ఎంత చక్కని కోటే ప్రయాగ కోట
కోటలో ఒక కోట ఏడు కోటలు
కోటలో ఉన్నది ఘనమైన వనమూ
అష్టదిక్పాలకులు సప్త మహఋషులు ,
ముక్కోటి దేవతలు, మునులు బ్రాహ్మణులు
మూలానా వటము కింద సంతరింతురు   ||ఎంత||

ఏ వేళ చూచిన మీ పూజలమ్మా,
ఏ వేళ చూచిన మీ సేవలమ్మా
ఏ వంక చూచిన ఆనందమమ్మా,
ఆనంద వేణిని చూడరోయమ్మా
పమిడి పువ్వుల చీర, పసిడి నెట్టారవిక
ముక్కూకు ముక్కెర, ముగిదరోయమ్మా
కంఠ మందూన మంచి కంటే రోయమ్మా ||ఎంత||

ఆణిముత్యపు ఛాయా గంగాభవాని
అపరంజి రేకుల ఛాయా సరస్వతి
నీలంపు ఛాయలతో నెలత యమునను
కూడి ఘనమైన ప్రయాగ గంభీర వేణి
మాధవుల రాణి మగువ త్రివేణి ||ఎంత||

మల్లియ పుష్పములు మగువ హారములు
చేమంతి పుష్పములు చెలియ హారములు,
పారిజాత పుష్పములు పణిత హారములు
పచ్చలు ముత్యాలు నీలాలు వజ్రాలు,
అచ్చ నవరత్నాల హారాలోయమ్మా ||ఎంత||

నలుదిక్కుల మరు మకర మాసమున
అందమైన త్రివేణి ముందరను
పెనిమిటి తొడపైన కూర్చుందురమ్మా
భక్తితో ముక్తితో వేణిస్తూరమ్మా
కోరిన కోర్కెలు నువ్విత్తువమ్మా

నీలకంఠుని రాణి నిత్య కల్యాణి
బాల శుభవతి భక్తవత్సలి
కోరిన వారికి కోరికలిచ్చు
అడిగిన వారికి ఐశ్వర్యమిచ్చు
మ్రొక్కిన వారికి మోక్షములిచ్చు

||ఎంత||

ఈ పాటను విని, నేర్చుకుని పాడుకోండి

No comments:

Post a Comment