ట్యూన్ " అందమైన వెన్నెల లోన; అచ్చ తెలుగు పడుచువలే " సినిమా పాట ఆధారంగా
చక్కనయ్యా సాయిచంద్ర ఎక్కడుంటువి రావయ్యా,
తక్కువేమి చేయమయ్య మక్కువ తో పుజింతుమయ
1. అడవి పక్షులకాహారం నీవు కాదా ఇచ్చేది
వృక్షములకు నీళ్ళను నీవు కాదా పోసేది
పూలకెన్నో రంగులు నీవు కాదా వెసేది
గర్భమందు శిశువులను నీవు కాదా పెంచేది
జీవకోటిని పోషింపగ...నీవె కాక వెరె యొక్క దాత లేడులె
భక్తాళి నేలేటి బంగారు నా తండ్రి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ||చక్క ||
2. విశ్వశాంతిని కోరుకోనీ నీదు భజనలు చేయాలా
కీర్తి కాంక్ష విడనాడీ నీదు కీర్తన పాడాలా
నీదు లీలలు వినినంత హృదయ స్పందన కలగాలా
నీదు లీలలు కనినంత సత్యమేదో తెలియాల
భావమందునా భాగ్యమందునా... నీవె కాక వేరెయొక్క దాత లేడులె
భక్తాళి నేలేటి బంగారు నా తండ్రి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ||చక్క ||

No comments:
Post a Comment