దేశ భక్తి గితాలు

 

తేనెల తేటెల మాటలతో 

దేవులపల్లి కృష్ణశాస్త్రి

తేనెల తేటల  మాటలతో మన దేశ  మాతనే కొలిచెదమా (2)

భవం భాగ్యం కూర్చుకుని ఇక జీవన యానం సేయుదమా (2)

||తేనెల ||

సాగర మేఖల చుట్టుకొని, సుర గంగ చీరగా మలచుకొని (2)
గీతా గానం పాడుకొని (2), మన దేవి కి ఇవ్వాలి హారతులు

||తేనెల ||

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగ (2)

గలగల పారే నదులన్నీ (2), ఒక బృంద గానమే చేస్తుంటే

||తేనెల || 

ఎందరొ వీరుల త్యాగబలం , మన నేటి స్వేచ్ఛకే మూలబలం (2)

వారందరిని తలచుకొని(2), మన మానస వీధిని నిలుపుకొని 

||తేనెల || 

భావం భాగ్యం కూర్చుకొని, ఇక జీవన యానం చేయుదమా

||తేనెల || 

మా తెనుగు తల్లికి మల్లెపూదండ

శంకరంభాడి సుందరాచార్య

మా తెనుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, (2)

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,(2)చిరునవ్వులో సిరులు దొరలించు నాతల్లి.

 

గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరాబిరా కృష్ణ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ, మురిపాల ముత్యాలు దొరులుతాయి.

 ||మా తెనుగు||

అమరావతీ గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు,నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయన కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక,నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం

జై తెనుగు తల్లి, జై తెనుగు తల్లి.


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి

                                                                                                                                                                    దేవులపల్లి కృష్ణశాస్త్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారి హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి


జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల

జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి


జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ

జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందరచరణ


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారి హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రీ


No comments:

Post a Comment