Friday, October 23, 2015

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయ నిరామయ సర్వ మంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామద
శ్రీగిరి నిలయ నిరామయ సర్వ మంగళా

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరముగ కాపాడే జననీ
మనసే నీ వశమై స్మరణే జీవనమై
మనసే నీ వశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె శాశ్వత మంగళనాయకీ

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయ నిరామయ సర్వ మంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి
రవ్వల తళుకుళ కళల జ్యోతికి కర్పూర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి

శ్రీలలితా శివజ్యోతి సర్వకామద
శ్రీగిరి నిలయ నిరామయ సర్వ మంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

రాజరాజేశ్వరీ దేవి పాట

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ
రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ
సౌంద్రరాజా వల్లి అంబా సర్వేశ్వరి ముక్కు తళుకు మెరియగ
చూడగ కిరిట ధారివై వెలయగా

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ

1. అఖిలాండేశ్వరీ నిత్య కల్యాణి కోటి సుర్య ప్రకాశిని కోమలి
కంచి కామాక్షి మధుర మీనాక్షి
కాశి విశాలక్ష్మి కాంచి మాహాదేవీ

||రాజరాజేశ్వరీ ||

2. తేజస్వరూపిణి దైత్య సంహారిణి 
     తేజస్వరూపిణి దైత్య సంహారిణి
     శ్రీజగద్భగవతీ శరణు నిన్నే వేడితీ

 ||రాజరాజేశ్వరీ||

3. శుక్రవారా పూజ నవరాత్రిలో
తొలి శుక్రవారా పూజ నవరాత్రిలో
కొలువై ఉండగా చూడగ
అడిగిన వారికి అభయమ్ములిచ్చు తల్లి
అడిగిన వారికి అభయమ్ములిచ్చు తల్లి
వరవదే భాగ్యముల్ సంపదలొసగము తల్లీ

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ
సౌంద్రరాజా వల్లి అంబా సర్వేశ్వరి ముక్కు తళుకు మెరియగ చూడగ కిరిట ధారివై వెలయగా
రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ