లలిత గీతాలు



మా మాధవుండిచట కనిపించెనా



మా మాధవుండిచట కనిపించెనా
మధురమౌ ఆ మురళి వినిపించెనా
మా మాధవుండిచట కనిపించెనా

పాల కడలి పైన పవళించు మొనగాడు
రేపల్లె వాడలో పాపడై వెలిసాడు
పాల కడలి పైన పవళించు మొనగాడు
రేపల్లె వాడలో పాపడై వెలిసాడు
ఓ పొన్న మందార వకుళ మాలికలారా ఆ ఆ
ఓ పొన్న మందార వకుళ మాలికలారా
ఆ గొల్ల వాడిచట కనిపించెనా అ
ఆ వేణు రవములే వినిపించెనా

మా మాధవుండిచట కనిపించెనా
మధురమౌ ఆ మురళి వినిపించెనా
మా మాధవుండిచట మా మాధవుండిచట
మా మాధవుండిచట కనిపించెనా ఆఆ

ఈ పాట విని నేర్చుకోండి

No comments:

Post a Comment