అన్నమాచార్య కీర్తనలు



అన్నమాచార్య కీర్తనలు




అదివొ అల్లదివొ శ్రీహరివాసము 

అదివొ అల్లదివొ శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివొ అల్లదివొ శ్రీహరివాసము

అదె వేంకటాచలమఖిలోన్నతము
అదివొ బ్రహ్మాదుల కపురూపము
అదివొ నిత్య నివాసమఖిలమునులకు 
అదె చూడుడు, అదె మ్రొక్కుడు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము

అదివొ అల్లదివొ శ్రీహరివాసము

చెంగటనల్లదివొ శేషాచలము
నింగినున్న దెవతల నిజవాసము
ముంగిట నల్లదివొ మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

అదివొ అల్లదివొ శ్రీహరివాసము

కైవల్యపదము వేంకటనగమదివొ
శ్రీవేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపదరూప మదివొ
భావింప సకల సంపదరూప మదివొ
పావనములకెల్ల పావనమయము

అదివొ అల్లదివొ శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివొ అల్లదివొ శ్రీహరివాసము
శ్రీహరివాసము శ్రీహరివాసము

 కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు 

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

కుమ్మర దాసుడైన కురువరప్పి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు
దొమ్ములు చేసిన యెట్టి తొందమాన్ చక్రవర్తి
దొమ్ములు చేసిన యెట్టి తొందమాన్ చక్రవర్తి

రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలడి నొచ్చినవాడు

కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
యెంచి యెక్కడైన వేంకటేశుడు మనలను  
మంచివాడై కరుణ పాలించినవాడు   

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడూ
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

పురుషొత్తమా పురుషొత్తమా పురుషొత్తమా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల
నీరిచ్చి పెద్దలిచ్చిన నిదానమా
దాహమిచ్చి దప్పిదీర్చు కాలమేఘమా
దాహమిచ్చి దప్పిదీర్చు కాలమేఘమా
దాహమిచ్చి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చెరువ చిత్తములోని శ్రీనివాసుడా


పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా

చెడనీక బ్రతికించే  సిద్ధమంత్రమా
చెడనీక బ్రతికించే  సిద్ధమంత్రమా
రొగాలడచి రక్షించే  దివ్యౌషధమా
బడిబాయక తిరిగె ప్రాణబంధుడా
బడిబాయక తిరిగె ప్రాణబంధుడా
బడిబాయక తిరిగె ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా  

పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషొత్తమా
పురుషొత్తమా..పురుషొత్తమా..పురుషొత్తమా

బ్రహ్మ కడిగిన పాదము 



బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము

చెలగి వసుధ గొలిచినదీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలి రిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడీ  పాదము
పమిడి తురగపు పాదము

పరమ యొగులకు పరిపరి విధముల
వర మొసగెడి నీ పాదము
తిరు వేంకటగిరి తిరమణి చూపిన
పరమ పదము నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే 


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

తందనాన  అహి తందనాన  పురె
తందనాన భళ తందనాన
భళ తందనాన




బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే

అనుగు దేవతలకును అలకామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖమొకటే
దినమహోరాత్రములు - తెగిధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు తిను నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొక్కటే


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

                                                          దేవ దేవం భజే దివ్య ప్రభావం 

దేవ దేవం భజే దివ్య ప్రభావం 
దేవ దేవం భజే దివ్య ప్రభావం
దేవ దేవం భజే దివ్య ప్రభావం

రావణాసురవైరి రణపుంగవం రామం 
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం                 
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజదీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామం 
దేవ దేవం భజే దివ్య ప్రభావం

నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భూగిశయనం

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామం 
దేవ దేవం భజే దివ్య ప్రభావం

పంకజాసనవినుత పరమనారాయణం
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరాజితజనక చాపదళనం
శంకరాజితజనక చాపదళనం
లంకావిషొషణం లంకావిషొషణం
లాలిత విభీషణం 
లంకావిషొషణం లాలిత విభీషణం 
లంకావిషొషణం లాలిత విభీషణం 
వేంకటేశు సాధు విబుధ వినుతం రామం
వేంకటేశు సాధు విబుధ వినుతం రామం

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామం 
దేవ దేవం భజే దివ్య ప్రభావం






No comments:

Post a Comment