Tuesday, July 15, 2014

నవగ్రహాల ఆశీర్వచన పాట



1. 

శ్రీ సర్వేశ్వర వర తనయుడు తేజస్కాముడు సిద్ధి బుద్ధి సంయుక్తుడు సీతా వరదుడు
గజముఖ ధరుడు గణ నాయకుడు 
ముషిక వాహన మోదక హస్తుడు 
గ్రహం గణపతి రక్షించు ఈ దంపతులను







2.


హంస వాహనుడు అభ్యాసనుడు నారాయణ సుతుడు 
వాణి కరమున వీణె కలిగిన వాణీ  విభుడు
వేదాతీతుడు వేదాజనకుడు వేదాంతార్థ విచారప రెండు 
బ్రహ్మ దెవుడా రక్షించు ఈ దంపతులను








3.

లక్ష్మి సహితుడు నిక్షేపాగ్న్యుడు పక్షి వాహనుడు
తాటక సంహారుడు పీతాంబరధరుడు,
అహల్య శాప విమోచనుడు అక్షయమొసగిన ఆది దేవుడు
శ్రీమహావిష్ణువు రక్షించు ఈ దంపతులను








4.

పార్వతి సహితుడు పన్నగ ధరుడు ఫాలాలోచనుడు
గౌరి హితుడు గంగాధరుడు గజచర్మాంబరుడు
గజముఖ ధరుడు గరళగ్రీవుడు కైలాసాద్రి నివాసుండైన
సాంబమూర్తి రక్షించు ఈ దంపతులను







5.
రక్త వస్తువ ప్రీతీకరుడు రక్తాంబరధరుడు
రక్త గాత్రుడు ఋగ్వేదుడు రాచాకార్యుడు
పదమూడారిట ఫలదాయకుడు పంచమ రాశుల నివసించెతడు
సూర్య గ్రహము రక్షించు ఈ దంపతులను




6.
తెల్లని గంధం తెల్లని మేను తేజస్కాముడు
రోహిణితుడు రాత్రీశ్వరుడు రూఢీగానతడు
మాషాసనుడు మన్మథ మిత్రుడు
మూడారు పది ముని జన్మాల మృత్యుకర్కట కేశుండైన
చంద్ర గ్రహము రక్షించు ఈ దంపతులను





7.

మేథిని సుతుడు మేశాలీశుడు మేధా తీతూడు
పది రెండింటను మూడారింటను పాలించెడి వాడు
ఆదక ధ్యాన మోహన పరుడు అగ్నిహోత్రునికనూకులుండు
అంగారకుడా రక్షించు ఈ దంపతులను







8.
అప్రకేశుడు ఆదిత్యాత్తుడు అత్యంతొత్తముడు;
కన్య మిథున రాశుల యందు కాంక్షను గలవాడు
ఎనిమిది నాలుగు పదకొండింటను ఎప్పటికి ఫల దాయకుడైన
 బుధ గ్రహము రక్షించు ఈ దంపతులను









9.
మీన ధనస్యు లాకరముగ యోధిని లోపలను
తొమ్మిది రెండిటను తొలుతగ అలమిచ్చు
ఋగ్వేదోత్తుడు లొకాతీతుడు ప్రీతి ద్రవ్యము ప్రీతికరుండు
గురు గ్రహము రక్షించు ఈ దంపతులను








10.

ఋషతుల రాశుల అవిరెండింటను విహరించెడి వాడు
భార్గవ సుతుడని దానవ గురుడని ప్రఖ్యాతైనాడు
ఆరేడు పది అవి మూడుగాక ధనములొసంగిన ధవళ శరీరుడు
శుక్ర గ్రహము రక్షించు ఈ దంపతులను







11.

మందగమునుడు మలినాంబరుడు మలినశరీరుడు ;
ఆరు మూడింటను కూలుండు ఆయుష్కారకుడు
కుంభ మృగాదుల కోరిన విభుడు ఛాయ సుతుడు ఛాయగ ధరుడు
శని గ్రహము రక్షించు ఈ దంపతులను







12.

కృష్ణ వర్ణుడు కృష్ణాంబరుడు కృష్ణ శరీరుడు;
పుష్టి నితుడు నిష్థా పరుడు శ్రేష్ఠుడు అతడు
మాషాసనుడు మన్మథ మిత్రుడు మూడారింటను ముఖ్యుండితడు
రాహు గ్రహము రక్షించు ఈ దంపతులను







13.

చిత్రవర్ణుడు చిత్రాంబరుడు చిత్ర శరీరుడు
చిత్రాగుప్తాదులతోడ మైత్రిత కలవాడు
త్రిషడస్థానములందున శంభుడు వృశలాపదుడు కుళుత పేషుడు
కేతు గ్రహము రక్షించు ఈ దంపతులను







14. ఫలశృతి



ఆశించెవ్వరు నవగ్రహాల మంగళ హారతి పాడినను
కాశి యాత్ర పోయిన ఫలము కలుగుటే కాకుండా
వాసిగ వారణాసి సుబ్బయ్య దాసుని హృదయ నివాసుండైన
శ్రీసర్వేశ్వర వర సన్నిధికి చేరుదురెల్లపుడు

సత్యనారాయణ స్వామి సినిమా పాట




శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా; మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం; అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం

                                                                                                        "శ్రీ సత్యనారాయణుని"

స్వామిని పూజించే చేతులె చేతులట; ఆ మూర్తిని దర్శించే కనులె కన్నులట (2)
తన కథ వింటే ఎవ్వరికైన జన్మ తరించునటా
               
                                                                                                        "శ్రీ సత్యనారాయణుని"

అర్చన చేతామా మనసు అర్పణ చేతామా స్వామికి మదిలోనే కోవెల కడదామా (2)
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా

                                                                                                        "శ్రీ సత్యనారాయణుని"

మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి
మంగళమనరే సుందర మూర్తికి వందనమనరమ్మా

                                                                                                       "శ్రీ సత్యనారాయణుని"

Tuesday, June 17, 2014

శ్రీకృష్ణ - గోపికల పాట






ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే
ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే

ఊట్టి మీది పాలు పెరుగు యెట్లు దించెనే, కొట్టపోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు
ఊట్టి మీది పాలు పెరుగు యెట్లు దించెనే, కొట్టపోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు

చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు, పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు, పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే

గోపికా స్త్రీలందరు నీళ్ళకెళ్ళగ ,వెనకతట్టి కృష్ణుడొచ్చి కళ్ళుమూసెనే 
గోపికా స్త్రీలందరు నీళ్ళకెళ్ళగ, వెనకతట్టి కృష్ణుడొచ్చి కళ్ళుమూసెనే 

కాళ్ళంగి మడుగులోన కలయువాడమ్మ బాలుడు కాడమ్మ పెద్దావాడమ్మా 
కాళ్ళంగి మడుగులోన కలయువాడమ్మ బాలుడు కాడమ్మ పెద్దావాడమ్మా 

ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే
ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే

లాలి పాట - Laali Paata





రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ      #రామ లాలీ#

అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగు దాక నిదురబోవేరా         #రామ లాలీ#

జోలలు పాడి జోకొట్టితే  ఆలకించేవురా
చాలించి మరి ఊరకుంటే సంజ్ఞ చేసేవురా  #రామ లాలీ#

అద్దాల మేడ లోనువ్వమరి ఉన్నవురా
ముద్దుగా నువ్వున్నవంటే మురిసేవు రామా   #రామా లాలీ#

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
వింతగా నీకుండనుండు వీర రాఘవా  #రామ లాలీ#

Sunday, January 12, 2014

భోగిపళ్ళ పాట (Bhogi Palla paata)




కలహంస గమనారో  
మన బాలునకు భోగిపళ్ళు 
పొయుదాము రారె చెలి

అంగానమణి వేగ బంగారు పీఠమున
అంగానమణి వేగ బంగారు పీఠమున
మన ముద్దు బాలులనుంచేదము 

||కలహంస||

ముద్దుగుమ్మా మనము మూడేసి దోసిళ్ళు 
ముద్దుగుమ్మా మనము మూడేసి దోసిళ్ళు
మురయుచు బాలుల శిరముపైన
పంకజాక్షి మనము పసుపు కుంకుమలిచ్చి 
స దయ హృదయములతో దీవింతము

||కలహంస||

భామరో గొనియాడ ముదబాల రక్షించు
భామరో గొనియాడ ముదబాల రక్షించు
రంగనాయకీవేళ రఘు రాముని

||కలహంస||

భోగిపళ్ళు

భోగిపళ్ళుచిన్న రేగుపళ్ళు, పువ్వులు/పువ్వుల రెక్కలు, చెఱకు ముక్కలు, బియ్యం, నువ్వులు, చిల్లర నాణాలు