Home (ముందుమాట)



ముందుమాట

ఒకప్పుడు పిల్లలికి ఇంట్లో అమ్మలందరు చక్కని సంధర్భోజిత పాటలు నేర్పేవారు. అలాంటి సంస్కృతి ఇప్పుడు బీటలు వారిపోయింది. 

ఇప్పటి పిల్లలకు పాటలు అంటే కేవలం చిత్ర గీతాలే. 

కొంత మంది తల్లితండ్రులు ఇది గమనించి పిల్లలకు ప్రత్యేకంగా సంగీత శిక్షణ ఇప్పిస్తున్నారు, ఇది ఒక మంచి పరిణామమే. 

అలా కాకుండా మన ఇంట్లో శుభకార్యలలో సందర్భాన్నిపట్టి, దేవతార్చన కొఱకు కొన్ని ప్రత్యేక పాటలు పాడుకోవచ్చు అని తెలియదు పిల్లలకు. 

నేను నేర్చుకున్న అలాంటి పాటలు  మా అమ్మ, అమమ్మ, పినతల్లులు నేర్పిన పాటలు కొన్ని ఇక్కడ లైబ్రరిగా పెట్టుకున్నాను.

ఆలంటి పాటలన్ని నా మేయిన్ బ్లాగ్ పోస్టులలో చూడవచ్చు. అలాగే నాకు నచ్చిన సినీ సాహిత్య గీతాలు కూడా పేజెస్ భాగంలో పొందుపరుచుకున్నాను.

ఈ బ్లాగు మీకు కూడా నచ్చుతుందని భవిస్తున్నాను.

ధన్యవాదములు

No comments:

Post a Comment