Tuesday, January 5, 2016

భరతుని లాలి పాట


భరతుని  (శకుంతల-దుశ్యంతుల పుత్రుడు) లాలి పాట


లాలి భుపాల బాల, శుభలీల లాలి లావణ్యశీల
లాలి బాలేందు బాల, శుభలీల లాలిగ సరస లోల ||లాలి||

1. సీతాది పరివారుడు, మునిలోక సంరక్షణాధారుడు,
సేతో భవాకారుడు నినుగాంచు సీతా మనోహారుడు ||లాలి||

2. నీ తండ్రి దుష్యంతుడు, ప్రణితావ నీ పాల సామంతుడు,
ఖ్యాతి విక్రమవంతుడు నిజయ శ్రేయస్కమాసర్వదిగంబరుడు ||లాలి||

3. నీ తల్లి శకుంతల పాడుమని నెస్తంపు నెల కాంతల,
మోదమున నిరుచింతల తిరుగుచును, మురియునది హరి కుంతల ||లాలి||

4. నీ  తాత కణ్వమౌని, నిజ తపోనిష్కామ శతాబ్ద్వయాని,
నియమముల నెల్లమాని యున్నాడు నీ పైన ప్రేమ బూని ||లాలి||

5. సరసీరుహా ప్రభూత, శ్రీరామ జగదీశ కరగ్రహీత,
సరస సద్గుణ సమేత నినుగాంచు జనక రాజాత్మ జాత ||లాలి||

6. లాలి రాజీవ నేత్ర సుచరిత్ర లాలిలావణ్యగాత్ర
లాలి దుష్యంత పుత్ర శుభగోత్ర లాలిగా సరసలోల ||లాలి||

No comments:

Post a Comment