Tuesday, December 29, 2015

శ్రీ మల్లిఖార్జున స్వామి పాట




బలేందుమౌళి నీ పాలపడితినీ,   
నన్ను పాలింప జాగేల బాలసుందరిలోల ||బలేందు||

1. ఫలన్నయి త్రీశూల పాణి, కపాల హస్త సురాళి ,
వందిత బేలనై యిటున్న గోలచెంది మొరాలకింపవదేలనయ్యా ||బలేందు||

2. సురులు దానవులు క్షీరపయొధీ తరువా,
 భికరమైన ధ్వనులచే గరళమోద్భవమొంద, 
పురములన్నియు గాల్ప గానో హరి పరాత్పరయనచు వేడగ, 
గరళమును భక్షించి యా సురవరుల బ్రోచిన హరుడ వీవే ||బలేందు||

3. తిన్నప్ప మున్ను త్తిష్ఠాన్న మివ్వగలేదా, 
పన్నుడవై మెచ్చి అతని భక్తిని కోరి, 
కన్నులందు జలంబు గార్పగ అన్న శంభోయనచు వేడగ 
కన్నులిచ్చి మెచ్చి నీ సాన్నిధ్యమున నిలుపలేదా ||బలేందు||

4. నంది వాహనమెక్కి బృందారకులు గొలువ
 సుందరేశ్వర కొండలందు తిరిగెదవేల, 
ఇందు దినకర వహ్ని నయన ముకుంద పూజిత పాదయుగళ 
సంధియంబులు దీర్చి నా హృత్మందిరంబున నిలుపలేదా ||బలేందు||

5. కైలాస నిలయ నీ లీలలన్నియు తెలియ, 
జాలరెంతటి వారు శైలజ ప్రియనాథా, 
బాలుడైన మృకండ శూరుడు కాలులను, భయమోంది వేడగ 
జాలి చెంది మొరాలకించి చిరాయువిచ్చిన హరుడవీవే
|| బలేందు ||

6. అంబుజాసనుడు నిశ్చంబు నీ దరిచేర, 
శంభో హరే యనచు సేవ చేయుచునుండ, 
అంబరంబున నుండి నిను జంబాది ప్రముఖులు నుతులు చేయ 
జగంబులను పాలింపవా జగదాంబతో శ్రీ శంభులింగా 
|| బలేందు ||

7. గంగా శిరమునను అర్థాంగియై సతియుండ 
పొంగుచు తిరిగేవు సంగారహితుడా వయ్యా 
అంగజారి పురాంత కాశా రంగధర వల్లూరి పురవర, 
మల్లిఖార్జున లింగ శ్రీ భ్రమరాంబికా చితాత్మబృందా
 || బలేందు ||


రాముల వారి పట్టాభిషేక పాట




శ్యామ సుందర రామ స్వామీ వామాంకమున హేమాసుందరీ సీతా భామ ఉన్నదీ అదిగో || శ్యామ||

1. ప్రేమచే హనుమంతుడగగ, రామచంద్రుని పదము పట్టగ 
సౌమిత్రియున్ ,భరతుడున్ ,విరుగడల వింజామరలు వీయగా 
|| శ్యామ||

2. హరి వెనుక శత్రఘ్నుడతిపత్రములు పట్ట, 
శరాణార్ధులై విభీషణ సుగ్రీవులు కొలువా, 
పరమభక్తుడు అంగదుడు, గజ గవాక్షుండు మొదలుగా 
వరుస సేనుండాది గాగల పరమేష్ఠింపుచుండగ 
||శ్యామ||

3. గిరిజా,శంభుడు, వాణీ పరమేష్టి సేవింప, 
సురులు ఆనందించి, కుసుమ వృష్టి గురియింపగ, 
భరద్వాజ, వశిష్ట, ముఖిభవ తీర్థ జలాభిషేకములు
కరుణతో సేయుమని నుతియింప కనకమణి సింహాసనంబున 
||శ్యామ||

4. ధణ ధణ ధ్వనీ నాధత్రయములు  మ్రోగగా
వీణాగానము ఆ నారదముని పాడగ, 
ధణ ధణాంకిట, కింకిణులతో, మేనకా, రంభలతో, 
ధాంతకిటకిటతోంతయాయని నటియింపుచుండగ 
||శ్యామ||

5. వారి వామాంకమున భూమిజనుతనుగూడి 
మెడనున్న ముత్యాల హారము తీసియా, 
వాయునందను చేర బిలిచియు నీవు చేసిన మేలు కొకై 
హారముని గైకొనమటంచును, ప్రేమచే యురమునను వేయగా
||శ్యామ||

6. ఖిండితారపుడా కోదండార్చిత పూజ్యుడై 
ఛండ ఖాండనమున, సరసీజాములు బట్ట, 
పుండరీకాక్షుండు, శ్రీ రాముండు కూర్చుండ 
వేముల కొండకోయని, బొడ్డు మల్లెలదండను మెడనిండ వేయగా 
||శ్యామ||

7. పచ్చనక్షింతలు పరమాత్ముడు చేబూని 
పడతీ సీతా శిరసుపై బోసిరి వేగ, 
అష్టదిక్పాలకుల భార్యలు, అరుంధతీ, అనసూయ మొదలుగ, 
వారందరును వజ్రాల హారతులిచ్చిరి వధువరులకప్పుడు ||శ్యామ||









భరతుని కనుగొని శ్రీ రాముడు అని




భరతుని కనుగొని శ్రీ రాముడు అని భ్రాంతి చెందినావే చెలియా ||భరతుని||

నరశార్ధుల రాముని వలెనే బోలిన అంచయానవింటే || చెలియా భరతుని ||

విల్లు విరచిన వీర శిఖామణి విలుకాడె కొమ్మా పల్లవోశ్ఠివో ధీరాగ్రణి వలె భద్రమూర్తి సుమ్మా || చెలియా భరతుని ||

వాని రూపమే, వాని గుణములే, వాని నడతలే, వానికి వీనికి భేదమే తోచదు వాని తమ్ముడేనే || చెలియా భరతుని ||

అరదము చిటికన వ్రేలితో నడిపిన ఆమె తనయుడేనే, పరమ శాంతుడు రాముని వలెనె గురిహిత వర్దనుడే || చెలియా భరతుని ||

కొంచము పొడుగే కోసల తనయ, పొడవే రాముని కంటే, మంచి గుణాభ్యుడు మాళవికేతుడు అంచయాన వింటే || చెలియా భరతుని ||

సుందరిమణులకు, సోదరతుల్యుడే మందరధీరుండే, ఇందుముఖీ సుతుడగు సీతాపతినికి తగునమ్మా || చెలియా భరతుని ||

సావిత్రి గౌరి హారతి




జయ హారతిదిగొ గౌరి సావిత్రి గౌరి దేవీ || జయ||

అంగనులందరు కూడి, శృంగారంబుగ నేడూ , మంగళకరమగునకు వందనమర్పించెదము || జయ ||

వెలదూలందరు కూడి, విరులతో పూజలు చేసి, మంగళకరమగు నీకు వందనమర్పించెదము || జయ||

అశ్వపతి పుత్రికవు, సత్యవంతుని సతివి సహకారిణివైనీవు సరగుణ బ్రోవగదమ్మ || జయ||

పతి ప్రాణము కొరకై, పల్లు ఇడుములుబడు నీవు, యమునిచే వరములు బడసి, అయిదవ తనమొందితివి || జయ ||

Thursday, December 24, 2015

హారతి పాట




హారతిదే జయ హారతిదే హారతి శ్రీ జయనాదయిదే
జయ హారతి శ్రీ జయనాదయిదే || హారతి||

1. పంచవింశ తత్వములకధిదుతుడై పంచ భూతముల కవ్వలి వాడై (2)
ఎంచరాని ప్రాపంచిక సాధ్వియై మించిన అచల స్వరూపనకున్ జయ మించిన అచల స్వరూపనకున్ || హారతి ||

2. నాదుబిందు కళా తీతునకున్ త్రిగుణా ప్రపంచవి దూరునకున్ , వాదబేదహీ నతుషారకా వాఙ్మానస గోదరునకిదే జయ వాఙ్మానస గోదరునకిదే ||హారతి||

3. రూపనామ క్రియ రహితునకున్ భవ పాపవిదారుకు పరమాత్మునకున్, తాపసేంద్ర హృద్కమల విహాసిని కృపామది నీజ ప్రహారికిని జయ హారతి శ్రీ జయనాదయిదే || హారతి ||