దాసావరేణ్యులు తగుభక్తితో వినుడీ దత్తాత్రేయుల చరితము
1. శ్రీ సదానందుని సేవ యొనర్చు భాసురాకారుని పరమ పావనుని వాసిగను అనసూయ గర్భ సువాస ముద్రిక సుపూర్ణ సోముని వాసిగా మీర వినుత యొగాభ్యసులైన మహనుభావుల
||దాసావరేణ్యులు||
2. వనజాసన పుత్రుడగు ఆ అత్రి మౌని తనయులు లేకున్నను తన మనమున "అపుత్రస్య గతిర్నాస్తి" అని వేదవచనములంగీకరింపుచు,వనితగని అనసూయ గర్భ సువాస ముద్రిక సుపూర్ణ సోముని కనకశయ్య కడ వేగమే చని తపోవన మందు భక్తి చే ఘన తపమ్మును కాంచరెంచన్
||దాసావరేణ్యులు||
3. నారదుడొకనాడు మిరియొక్క శనగలు ఆ రూఢిగా గైకొని వారిజ భవలోక వైకుంఠ, కైలాస మారాసి యనె సర్వమంగళ, ఇందిర, భారతులగని మీరు మాకివి పచనమొప్పగ చేయుమన్నను నేరమని ఇటు చేరి నవ్విన చేరెదను అనసూయకదాకు
||దాసావరేణ్యులు||
4. అమ్మా ఈ శనగలు సమ్మతముగ వండి ఇమ్మని పలుకగను, తెమ్మని యాదేవి స్థిరమతి పతి పాదములపై భక్తి సమ్మతముగ నిల్పి నెమ్మదిగ కమండల జలమ్ములు నీలమ్ముగూర్చియు పొయ్యినిడితి ఘమ్ముగా అనలమ్ము గూర్చియు కోరి మృదువుగ వండిపెట్టెను
||దాసావరేణ్యులు||
5. దేవ మునీంద్రుడా దేవి మహత్యము భావములో మెచ్చుచు వెవేల విధముల వినుతించి అవి గొని సావధానమ్మున చాల భక్షంపుచు భూవలయమున నెలకొన్న సుతులకు పూర్ణుడై ఎరిగింపుచూజని తీవ్రతరమున బ్రహ్మ హరిహర దేవులకు ఆ తెరువుతెల్పెను
||దాసావరేణ్యులు||
6. పదునాల్గు లోకముల పడతునలనందిరిని పరిశోధించి చూచితి పదరుట లేక ఈ పాతివ్రత్యము గల సుదతి యా సైన సూర్యదేవికి తప్ప అది నిజమ్మని పల్కె నారదుడేగె మువ్వురు దేవులంతలు బెదిరి చింతిలి పతులగోడిత ప్రేమ మీరగ పలుకక అలిగియుండిరి
||దాసావరేణ్యులు||
7. కాంతలార ఈ పనులేమో తెల్పుడి ఘడియలో చేతుమనిరి వెరువక జడియక లేచి యా సతులు భర్తల చూచి వెరువక సురమౌని వెస్నానుసూయను కడు పతివ్రత యనచు పల్కెను ఘాన మీరలు వేగమేచని వనిత జరుపకయున్న తనువులు విడుతమని యాసతులు మువ్వురు
||దాసావరేణ్యులు||
8. కౌమినులారా ఈ కార్యమెంతయు గలదు ఘడియలో చేతుమనిరి మొమాట ముడిగి యా త్రిమూర్తులు పయనమై కామరూపమ్మున కపట భూసురులగుచు నియమమొప్పగ అత్రి ఆశ్రమనమునకు వేగమె జనితెంచివారలు ఆ మునీశ్వరులంత వారికి ఆ ముని స్వరంతవరికి అతిథి పూజలు ప్రేమసల్పిరి
||దాసావరేణ్యులు||
9. వర స్నాన సంధ్యలు వార్చిరి మువ్వురు స్థిరముగ కూర్చుండిరీ పరగనత్రి భార్య పాక మొప్పగ చేసి వరుస పళ్ళెరములో వడ్డించ వచ్చిన, తరుణిని గని నీవు మాకిటు తగదు ఈ వస్త్రమొప్పగకడు దిగంబరివగచు బెట్టిన కొనియదము మాకిష్టమని పల్కిరి
||దాసావరేణ్యులు||
10. ఎక్కడా చూడలేదీ మహతాశ్చర్యము ఎక్కడి కల్లోలము, ఎక్కడి భూసురులు ఏటి కొచ్చిరని చక్కయోగదృష్టి కని, ఒక్క పాటము చూచి, మక్కువతో పతి భక్తి మదినిడి నక్కమండల మందు జలములు, ఒక్కచేకొని మువ్వురు మీదనే ఒక్క సమమున చల్లె నా సతి
||దాసావరేణ్యులు||
11.ఆలోను దేవి మహాత్యముచే తాను ఆ క్షణమె వీక్షింపుచు పోలింప మువ్వురు పురిటి శిశువులై, బాలల గతి నేడ్వ ఫణతి వరలనెత్తి లాల బోసి శిరోజలంబులు, కడులాల్చి డోలికలోను నిడితి జోలపాడుచు నుండగానే లోల శత వర్షములు గడిచెను
||దాసావరేణ్యులు||
12. అల్ల నారదమౌని అరసిపోయి వారి ఇల్లాండ్లతో చెప్పగ, యుల్లాము లోపల తల్లడపడి వారు, వెళ్ళి వేగిరమె వచ్చి వెసనాను సూర్యనుపల్లవాధరి నీవు మాకిటు పట్టి నీవు పురుషభిక్షము, తల్లి పెట్టుమటుంచు పమిటలు ధరణిపై పరచుకొని వేడిరి
||దాసావరేణ్యులు||
13. కాంతలారా ఈ గతి ఏమో ని కదసి వేడగానే పంతము పో విడచి, అంతరంగమునందు నెంతయో కరుణించి శాంతమొప్పగ మౌని కాంత సద్భక్తితో వింతయగు కమండల జలమ్ములు మింతిరింపుచు పైన జల్లిన అంతలోనే హరిహర చతుర్ముఖులు నిజరూపముదాల్చిరి
||దాసావరేణ్యులు||
14. అని ఇట్లు ఇరువురు ముని దంపతులు తాము మనమున వేడగానే ఘనులారా మిమ్మిట్లు కరుణించితిరిగాన జనని జనకులగుచు అనయము మీకును తనయులై పుట్టేము , మాకు తల్లి మహాంశముల వల్లను జనన మొందిన మమ్ము సతతము చాలగా పోషింతుమని పల్కిరి
||దాసావరేణ్యులు||
15. హరి వంశమయమున పరగ దూర్వాసుడు అత్రికి జన్మించెను సరసిజ గర్భమున సుధాకారు ముఖమున ఇరువంద జనియించె అట్టి ఆత్రేయుడై దిరసుడగు ద్రూరుడగు మార్గశిర శుధ్ధ చతుర్దశి వృషభలగ్నమున పరగ దత్తాత్రేయులాత్రికి బాగుగా జన్మించె సుతుడై
||దాసావరేణ్యులు||
16. పాదారజంబున పదునాల్గు లోకములు పావనమొందుచును, పాదుకలిచ్చి వేంకట నారాయణ కవి ఆధారమ్ముగ బ్రోచే అట్టి ఆత్రేయుడై నియమ మొప్పగ ఈ సద్భక్తి ఈ కథ మనసు నెప్పుడు విన్న వారికి కేవలంబుగ బ్రహ్మలోకము ప్రేమతో శ్రీహరియొసంగెను
||దాసావరేణ్యులు||