కరుణశ్రీ - పుష్ప విలాపం





కరుణశ్రీ జంధ్యాల పాపైయ్య శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపం

చేతులారంగ నిను పూజించు కొఱకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను
గంగలో ముంగి దౌత వకళము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నెనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి
గోరానెడునంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి
"మా ప్రాణము తీతువా” యన్చు బావురుమన్నవి, కృంగిపోవుచు
నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై

తల్లి ఒడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
ఆమ్ముకొందు వేమోక్షవిత్తమ్ము కొఱకు!
హృదయమే లేని నీ పూజలెందుకోయి?

జడమాతుల మేము, జ్ఞానవంతుడవు నీవు
బుద్ది యున్నది, భావ సమ్రుద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్నిపూలు?

ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కనిపెంచిన తీగతల్లి
జాతీయత దిద్దితీర్తుము; తదీయ కరమ్ముల లోన
స్వేచ్ఛమై నూయలలూగుచుం మురియుచుందుము;
ఆయువు దీరునంతనే హాయిగ కన్ను మూసెదము
ఆ యమ్మ చల్లని కాలి వ్రేళ్ళపై

గాలిని గౌరవింతుము సుగంధము పూసి;
సమాస్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు;
మిమ్ము బొట్లనేత్రాలకు హాయిగూర్తుము; స్వ్తంత్రుల మమ్ముల స్వార్దబుద్ధితో
తలుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతుల కోసితెచ్చు పుణ్యాత్ముడా!
నీకు మోక్ష మెటులబ్బును? నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే?
చరాచరవర్తి ప్రభుడు మా పవిత్రాత్మల నందుకోడే!
నడమంత్రపు నీ తగులాటంవేటికిన్?

ఊలు దారాలతో గొంతుకురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము
అకటా! దయలేనివారు మీ ఆడువారు

గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొఱకు
పులుముకొందురు అంత మీ కులము వారు

అకటా! హాయి మోము మహిశాసురులెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి మరు రోజుడయానని వాడి వట్టలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంట దిబ్బపై

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద
మాధురీజీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించి పోయె;
మా యవ్వన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురు తోడ చిమ్మి
మమ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా!

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండా!
మైల పడిపొయెనోయి నీదగు  మనుజజన్మ

పూజ లేకున్న బాబు నీ పున్నెపాయె
కోయబోకుము మా పేద కుత్తుకలను
అకటా! చేచేత మమ్ముల హత్య చేసి
బాపుకొనబోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చివాట్లు పెట్టినట్లుగాన
పూలు కోయ చేయాడలేదు
ఏమి తోచక దేవర కెఱుకసేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను

No comments:

Post a Comment