Wednesday, January 6, 2021

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ

ఈ పాటను చివరనున్న ఆడియో విని, నేర్చుకుని, పాడుకోండి

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా (2)

వాటాముగా నీదు పాటా పాడుచునుండ (2)

నోటీ మాటాకైన నోచుకొనగాలేదే

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

మంగళకర మేల్ బంగారు కలశముతో  (2)

గంగ స్నానాము చేయ గావించి నినుగొనీ

 మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

పట్టు పీతాంబరము బాగు మీరగ గట్టి (2)

వక్షస్థలమున తులసి మాల వేసినగానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

అత్తరు పన్నీరు యుక్తమగు గంధము (2)

మిత్తరి నీ మేను నిండ అలదిన గానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా 

తిరువాణి తిరుచూర్ణం ముద్దుమోమున దిద్ది (2)

ఆభరణములను అలంకరించిన గానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

అగరు సాంబ్రాణీ, ధూపము వేయగ  గొనీ (2)

ఖగరాజ గమన నీ నగుమోము ఇటు చూపి  

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

కదళీ, నారికేళ , ఖర్జూర ఫలములు (2), 

ముదముతో నైవేద్యం చేసిన గానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

వక్కలాకులు నూ ,లవంగాల్చేబూని  (2)

మక్కువ తో నీకు ముడుపులిచ్చిన గానీ

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

నీరాంజనం నీకు నిర్మలముగనిచ్చి (2), 

ఆత్మ ప్రదక్షిణం ఆచరించిన గానీ  

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

మంత్రపుష్పము నీకు  మరియాదగానొసగీ (2) 

సాష్టాంగ నమస్కారమ్ము చేసినకాని 

మాట్లాడగా తాగదా  శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా 

షోడోపచారములు సంపూర్తిగా జేసి (2) 

ఆత్మ ప్రదక్షిణం ఆచరించిన గానీ  

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా

ఈ పాటను క్రింది ఆడియో విని, నేర్చుకుని, పాడుకోండి

No comments:

Post a Comment