Saturday, April 4, 2020

సత్య నారాయణ స్వామి కథ పాట


సత్య నారాయణ స్వామి కథ పాట


ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి

నళినాక్షులారా మంగళమనరే సత్య నారాయణ స్వామికి
నిత్యానంద నిరుపమ గుణవర్తికి, నాథా సీత జనకజ సంపూర్తికి
జలజ సద్రుశ విశాలనయనుని కలికిలాలుకు పలుకు తరునకు
సలలితమ్ముగ కనకపళ్ళెరములను హస్తములహరించుక

|| నళినాక్షులార ||

మునినారాజునకు వనజనాభుడు తన, తనువగు సత్కథయు 
వినిపించగ మనము సంతసమొందియు
అనగ పూజ విధివిధానమనుగ్రహించి యనచు నుడువగ
సనక ముఖమున సమిసమిదమను కనుగుణంబని వినుతి సల్పెను

|| నళినాక్షులార ||

నొక పేద బ్రాహ్మణునకు, తన రూపము నొక భూసురుగ చూపియు
తనదూ పూజ, సకలము వినతెల్పియూ, మార్చులకెల్ల వినిపించెనని యెంచియు
వికలంబు కాగ, సద్వితి తోయ చింతాయ
నొకడు కట్టెలు నొనరనమ్ముచు వికటముగ ఏతెంచి  కథ విని
 ప్రకటముగ ఈ వ్రతము చేసిన సుఖము సంపదలిక నొసంగును

|| నళినాక్షులార ||

ధృతినుల్కముఖుడు ఈ వ్రతమాచరించ, సమ్మతి నొక్క సాధు గాంచి
ఏమని ఎంచి, పతికి నమస్కరించి , హితవూ చేత మన్మతి సంతతికీ
పతితలంచి ప్రసాద త్యాగము సతికినిలకడ పతియునుంచిన
అతడు తగు వరునకు నొసంగీ వ్రతము చేయక సుతుని మరిచెను

|| నళినాక్షులార ||

పరగ రత్నాసనుపురమునకేసాగి వన  జామాతను కూడుక
నోడలపైన, నొరగి బేరములాడగ ,విష్ణుండు కోప పరిత  శాపంబిడగ
హరిని లీలావతి కళావతి సరముగొలువగ వరములొసగెడి
కరుణ రాజిత దీని మరిచి త్వరగ పూజలిడి విభుని చేరెను

|| నళినాక్షులార ||

రంగుగనొకనాడు, తుంగధ్వజుడును పొంగి కానలకేగియు, మృగములను కాణణ్గి వేటాడియు
ఒక వటమున చేరంగ  పొయినంతను , శృంగార గోపాలురు కూడి పూజించగ
దొంగిలించి ప్రసాద  త్యాగమనంగానె  దు:ఖమ్ము శౌరికి
చేరి శౌరి  రక్షించె రాజును ఇంగితజ్ఞానము చేసెవినుడిక

|| నళినాక్షులార ||

ఆర్య సూతుడు సత్యనారయణుడు శుభచార్యులు ప్రకటించెను
శ్రీ మహంకాళ పర్వతమును మించెను
నిర్వహించిన సర్వ గుణికిని నిర్విదానై   స్థైకధాయికి
ధైర్య విపుబల  గర్వహరణ విచార్య మానుక వారి భక్తికి

|| నళినాక్షులార ||


ఈ పాట విని, నేర్చుకుని పాడుకోండి

No comments:

Post a Comment