Wednesday, January 6, 2016

కర్పూర హారతీ ఇవ్వరే

కర్పూర హారతీ ఇవ్వరే నేర్పుతో త్రిజగన్మోహినికీ
దర్పణ సుగండస్థలికి, సర్వ వేణులార మీరు దర్పక సంహారికీ 
కర్పూర హారతీ ఇవ్వరే నేర్పుతో త్రిజగన్మోహినికీ

చంద్రకాంతవ తాంసికీ , చాంపేయ కుసుమ విలాసినికీ
చందనకుసుమ విలాసినికీ; కుందన నవరికి , పత్ర కుంకుమ పంకోరస్థలికి
కర్పూర హారతీ ఇవ్వరే నేర్పుతో త్రిజగన్మోహినికీ

ఊర్ధ్వ కేశ విరూపాక్షికీ ; అర్ధరాత్రి విలాసినికీ
అర్ధనారి ఈశ్వరికి ;భద్ర మహాంకాళి సౌబ్రహ్మాండ ధారునకు
కర్పూర హారతీ ఇవ్వరే నేర్పుతో త్రిజగన్మోహినికీ

శంకరీ రణ మహా ఘొర భయంకర భుజగ భూషిణికీ
కుంకుమ దరహాస తాంకురికీ ;కరి కణ కనక రత్నస్థికిత కింకిణి పదాంకితకు 
కర్పూర హారతీ ఇవ్వరే నేర్పుతో త్రిజగన్మోహినికీ

గౌరి మహేశ్వరి హై క్లీం, కౌమారి మహాంకాళి సౌ వారాహి వైష్ణవి
హ్రీం శ్రీం నారారుధిర మధ్వమాంసు పురాళి సుస్వాదినికి ||కర్పూర||

నీరజాక్షులారా వినరే నిర్మల కృష్ణా తీరమున
కోరి బెజవడ దుర్గమున, కోరి బెజవడ దుర్గమున
చేరి వసించిన జ్వాలా నారసింహుని సోదరికి
కర్పూర హారతీ ఇవ్వరే నేర్పుతో త్రిజగన్మోహినికీ

మేలుగ శ్రీ తుంగతుర్తి బాలకృష్ణ కవిపాలునికి ,ఆభిల జ్వాల కరాళినికి
క్పాలికతో మారా శక్తి లీలాహార ధారుణికి ||కర్పూర||

No comments:

Post a Comment