ఒడుగు (ఉపనయనం)మంగళ హారతి
మంగళం శ్రీ సర్వమంగళాత్మజునకు
మంగళం హృదయాంత రంగమునకునూ
మంగళం భక్తజన మందార వీక్షణకు
సంగతుగ సుబ్రహ్మచారికిపుడు
జయ మంగళం నిత్య శుభ మంగళం
1. ధర్మపుత్రుండిలను తనకు జన్మించగా
నిర్మలాత్ముడైన నీల కంఠూ,
ధర్మపుత్రై చాల జన్మనామమొనర్చి
చిర్మూర్తమున సుబ్రహ్మచారికిపుడూ || జయ||
2. అరయగా ఆరునెలలన్నంబు ముట్టించి,
మురయుచూ చెవుల మూడేండ్లకూ
కరమొప్ప గర్భాష్ట కనక ఉపనయనము
జరుగననుచు సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
3. తల్లి పొత్తుల కుడిచి, తండ్రికిని దండంబిడి
విలసిల్లుచును భిక్షమెత్తి పునః ,
తల్లి భిక్షము పెట్ట తరువాత విప్రుడై
చెల్లుచుండిన సుబ్రహ్మచారికిపుడు ||జయ||
4. అభిమహోత్సవముగనూ, ఆచార్యులను బట్టి
ఉపదేశ దేశములనుత్సరించి,
ప్రభవమా, అభితన ప్రభు ఉపన్యాసంబు
సభలోన సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
5. పాలాశ సమిధలు పదహారు పట్టుకొని
బాలుడౌపోసనం బహుగ చేసి
చాల మూడవ దినము సభలోన సదస్యము
నాల్గావ నాడు పాలాశ హోమం ||జయ||
6. మేలుతో, బహుమల్లె పూలతో
పసిడి జంధ్యాలతో, బహు చక్కిలాలతోను,
శాలువలు, పాలాశ, చర్మగోచి, ముంజి
చాల గల్గిన సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
7. శ్రీశైల చెన్న మల్లేశలగ్నయ
వారణాసి సుబ్బయ్య భూమి రాశి వేసి
మంగళం భక్తజన మందార వీక్షణకు
సంగతుగ సుబ్రహ్మచారికిపుడు
జయ మంగళం నిత్య శుభ మంగళం
1. ధర్మపుత్రుండిలను తనకు జన్మించగా
నిర్మలాత్ముడైన నీల కంఠూ,
ధర్మపుత్రై చాల జన్మనామమొనర్చి
చిర్మూర్తమున సుబ్రహ్మచారికిపుడూ || జయ||
2. అరయగా ఆరునెలలన్నంబు ముట్టించి,
మురయుచూ చెవుల మూడేండ్లకూ
కరమొప్ప గర్భాష్ట కనక ఉపనయనము
జరుగననుచు సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
3. తల్లి పొత్తుల కుడిచి, తండ్రికిని దండంబిడి
విలసిల్లుచును భిక్షమెత్తి పునః ,
తల్లి భిక్షము పెట్ట తరువాత విప్రుడై
చెల్లుచుండిన సుబ్రహ్మచారికిపుడు ||జయ||
4. అభిమహోత్సవముగనూ, ఆచార్యులను బట్టి
ఉపదేశ దేశములనుత్సరించి,
ప్రభవమా, అభితన ప్రభు ఉపన్యాసంబు
సభలోన సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
5. పాలాశ సమిధలు పదహారు పట్టుకొని
బాలుడౌపోసనం బహుగ చేసి
చాల మూడవ దినము సభలోన సదస్యము
నాల్గావ నాడు పాలాశ హోమం ||జయ||
6. మేలుతో, బహుమల్లె పూలతో
పసిడి జంధ్యాలతో, బహు చక్కిలాలతోను,
శాలువలు, పాలాశ, చర్మగోచి, ముంజి
చాల గల్గిన సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
7. శ్రీశైల చెన్న మల్లేశలగ్నయ
వారణాసి సుబ్బయ్య భూమి రాశి వేసి
దేశదేశాలెల్ల దివ్యముగ నిల్పిన
శ్వాసనంబుగ సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
శ్వాసనంబుగ సుబ్రహ్మచారికిపుడూ ||జయ||
No comments:
Post a Comment