Tuesday, October 12, 2021

రాములా చేరి హారతులివరే








రాముల చేరి హారతిలివరే ,శృంగార వతులు రఘురాముల చేరి హారతిలివరే

రాములే పరంధాములై వైకుంఠ ధామము విడచియో హేమాంపాద సేవ, దామోదరాజేంద్ర ప్రేమతో నిలజులై దామోదరించిన రాముల చేరి హారతిలివరే 


నీలమేఘ శరీర వర్ణుడే, పూర్ణేందు వదనుడు ఈ లోల నేత్రుడు కంబుడు, కిందనుడే, 

బాలుడౌ మానిమూలనే ద్రుంచిత నాలోచనాలయి మూల గ్రహించియో దోవాలో తాటకిని కూలద్రోయించి వాలి తోలి వేగ పాలనజేసిన రాముల చేరి హారతిలివరే 


యాకుతానం ఘనాఘనా నిలుడే , శిలాక్షాతిని పదహతి నాతి చేసిన మహామాహా బలుడే  

ప్రీతిగుల్ల తరువాత ప్రవేశించి భుతేష ధనమోయి ప్రీతిగ ఖండించి  సీతను పెండ్లాడి రాతానోడించి సాకేతము చేరిన  రాముల చేరి హారతిలివరే  


జిహ్మరంబులన వానరుల తొలిచి స్వామిని వలచి 

శంభ రాత్రు జాడలను తెలిసి అంబుజ బంధించి తుంభర సౌరసరభుడై నినుబ్రోవ కుంభించి రావణ కుంభకర్ణాదుల కుంపిని పడగూల్చి 

సాంబ్రామముగను సాకేత మేలిన రాముల చేరి హారతిలివరే


జానకితో కూడ తోలించి, అయోధ్య నగర యజమాలులై సామ్రాజ్య పదవిగాంచి

భానుకోటి సమాన తేజులై సామము విక్రమ, భుదేనుల బ్రోవలైలాడులా వేంకటాచెలనుతునకును 

రాముల చేరి హారతిలివరే  









Saturday, May 22, 2021

శ్రీ గణనాథ

 


ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి

శ్రీ గణనాథ సిందూర వర్ణ

కరుణ సాగర కరి వదన

అంబా సుత అమర వినుత

లంబోదర లకుమికరా


సిద్ధ చారణ గణ సేవిత 

సిద్ధి వినాయక తే నమో నమో

సకల విద్యాది పూజిత 

సర్వోత్తమ తే నమో నమో 


ఈ పాటను  విని, నేర్చుకుని పాడుకోండి

Wednesday, May 12, 2021

గణపతి పాట


 ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి

గణపతి గణపతి గణపతి

నేనతి వినయముతో మ్రొక్కితిని

గణపతి గణపతి గణపతి


ఏకదంతము గణనాథ 

మమ్మేలుము శ్రీ వల్లభనాథ

ఏకదంతము గణనాథ 

మమ్మేలుము శ్రీ వల్లభనాథ


గణపతి గణపతి గణపతి

నేనతి వినయముతో మ్రొక్కితిని


పార్వతి తనయుడవని నిను నేను

పరి పరి విధముల వేడితిని

పార్వతి తనయుడవని నిను నేను

పరి పరి విధముల వేడితిని


గణపతి గణపతి గణపతి

నేనతి వినయముతో మ్రొక్కితిని

గణపతి గణపతి గణపతి


ఈ పాటను విని, నేర్చుకుని పాడుకోండి


Wednesday, January 6, 2021

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ



ఈ పాటను చివరనున్న ఆడియో విని, నేర్చుకుని, పాడుకోండి

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా (2)

వాటాముగా నీదు పాటా పాడుచునుండ (2)

నోటీ మాటాకైన నోచుకొనగాలేదే

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


మంగళకర మేల్ బంగారు కలశముతో  (2)

గంగ స్నానాము చేయ గావించి నినుగొనీ

 మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


పట్టు పీతాంబరము బాగు మీరగ గట్టి (2)

వక్షస్థలమున తులసి మాల వేసినగానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


అత్తరు పన్నీరు యుక్తమగు గంధము (2)

మిత్తరి నీ మేను నిండ అలదిన గానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా 


తిరువాణి తిరుచూర్ణం ముద్దుమోమున దిద్ది (2)

ఆభరణములను అలంకరించిన గానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


అగరు సాంబ్రాణీ, ధూపము వేయగ  గొనీ (2)

ఖగరాజ గమన నీ నగుమోము ఇటు చూపి  

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


కదళీ, నారికేళ , ఖర్జూర ఫలములు (2), 

ముదముతో నైవేద్యం చేసిన గానీ 

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


వక్కలాకులు నూ ,లవంగాల్చేబూని  (2)

మక్కువ తో నీకు ముడుపులిచ్చిన గానీ

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


నీరాంజనం నీకు నిర్మలముగనిచ్చి (2), 

ఆత్మ ప్రదక్షిణం ఆచరించిన గానీ  

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


మంత్రపుష్పము నీకు  మరియాదగానొసగీ (2) 

సాష్టాంగ నమస్కారమ్ము చేసినకాని 

మాట్లాడగా తాగదా  శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా 


షోడోపచారములు సంపూర్తిగా జేసి (2) 

ఆత్మ ప్రదక్షిణం ఆచరించిన గానీ  

మాట్లాడగా తాగదా శ్రీకృష్ణ నాతో మాట్లాడగా తాగదా


ఈ పాటను క్రింది ఆడియో విని, నేర్చుకుని, పాడుకోండి


కేశవ నామాల పాట

 



 ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి

కేశవ అని నిన్ను వాసిగ భక్తులు వర్ణించుచున్నారు మేలుకో

వాసవీ వందిత వసుదేవ నందన మేలుకో 

నారాయణ  నిన్ను నమ్మిన భక్తులను కరుణతో బ్రోతువు మేలుకో

శరణత్రాణ బిరుదు నీకున్నది, శశిధర సన్నుత మేలుకో 

మాధవ అని నిన్ను యాదవులు అందరు మమత తో చెందేరు మేలుకో

చల్లని చూపుల తెల్లని నామము, నల్లని నా స్వామి మేలుకో

గోవింద అని నిన్ను గోపికాగొల్ల వారందురు మేలుకో

గోపి మనోహర గోవర్ధనోధ్ధార గోపాల బాలుడా మేలుకో

విష్ణు రూపము దాల్చిన విభవము వర్ణింప, విష్ణురుపుడ వేగ మేలుకో

దుష్ట సంహార దురితమ్ములెడబాపు సృష్టి సంరక్షక మేలుకో 

మధుసూధన నీవు మగువతో కూడి మరచి నిదురించేవా, మేలుకో

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె వనరుహలోచన మేలుకో 

త్రివిక్రమ అని నీ చక్రశుక్రాదులందురు  మేలుకో

శుక్రాది గ్రహములు సుందర రూపమ్ము చూడగోరినారు  మేలుకో

వామన రూపమున భూదానమడిగిన పుండరీకాక్షుడా మేలుకో 

వల్లి నీ పాదానా బంధన చేసిన నందనందన మేలుకో

శ్రీధర గోవింద రాధామనోహర, యాదవకుల తిలక మేలుకో 

రాధా వధూమణి రాజిలకనంపినది పద చూదువుగాని మేలుకో

ఋషికేశ  నిన్ను కొనియాడు ఋషులందరు వచ్చి కూర్చున్నారు మేలుకో  

వచ్చిన వారికి వరమ్ములు ఇవ్వాలి వైకుంఠ వాసుడా మేలుకో 

పద్మనాభ నీదు పత్నిభాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో

వీరకారకమైన పావన  నామము పాడుచూ వచ్చిరి మేలుకో

దామోదర నిన్ను దేవతలందరు దర్శింప వచ్చిరి మేలుకో

భుమి భారముమాన్పి బంధముల బ్రోవుమని వేచిరి భుకాంత రమణులు మేలుకో

సంకర్షణ నీవు శత్రువుల హరింప సమయమయి ఉన్నాది మేలుకో

పంకజాక్ష నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో

వాసుదేవ నీకు భూసుర పత్నులు భుజింపదెచ్చిరి మేలుకో

భాసురమ్ముగ యాగ రక్షణ కొఱకు వేచియున్నారు మేలుకో

ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో

ఆబ్జ వంశమునందు ఉద్భవించిన కుబ్జను ఆదరించిన దేవా మేలుకో 

అనిరుద్ధయని నిన్ను అబ్ధసంహరణ అనుసరింప వచ్చిరి మేలుకో 

అండజ వాహన  అబ్ధసంహరణ దర్భ శయన వేగమే మేలుకో 

పురుషోత్తమ నీకు పుణ్య అంగనులందరు పూజలు చేతురు మేలుకో

పురుహూక పండిత , పురహర మితృడ , పూతన సంహారక మేలుకో 

అధోక్షజ నిన్ను స్మరణ చేసిన హరి, దురితమ్ములెడబాయు మేలుకో  

వరుసతోడ నిన్ను స్మరణ చేసినవారు వందన మొసగెదరు మేలుకో   

నారసింహ నిన్ను నమ్మిన భక్తులను కరుణ బ్రోతువు, వేగ మేలుకో  

శరణనన్న  రక్షణిత్తు వని బిరుదు నీకున్నదే, శశిధర సన్నుత మేలుకో

అచ్యుత యని నిను నిత్యము కొనియాడె ప్రమథులు వచ్చిరి మేలుకో

పచ్చని చేలమ్ము అర్చగ దాల్చిన లక్ష్మీమనోహర మేలుకో 

జనార్ధన నీవు శత్రువుల హరింప సమయమై ఉన్నది మేలుకో

పంకజాక్ష నీదు పావన నామము పాడుతూ వచ్చిరి మేలుకో

ఉపేంద్ర అని నిన్న ను యాదవులందురు యమునా తీరమున ఉన్నారు మేలుకో

గోపికా  కాంతలు నీదు రాకను కోఱి వేచి ఉన్నారు మేలుకో


మురళి గాన లోల  మేలుకో , ముకుంద మాధవ మేలుకో , 

రాధ మనోహర మేలుకో  ,మేలుకో మేలుకో మేలుకో  కృష్ణా

మేలుకో  కృష్ణా, మేలుకో  కృష్ణా...


ఈ పాటను విని, నేర్చుకుని పాడుకోండి