
శ్యామ సుందర రామ స్వామీ వామాంకమున హేమాసుందరీ సీతా భామ ఉన్నదీ అదిగో || శ్యామ||
1. ప్రేమచే హనుమంతుడగగ, రామచంద్రుని పదము పట్టగ
సౌమిత్రియున్ ,భరతుడున్ ,విరుగడల వింజామరలు వీయగా
|| శ్యామ||
2. హరి వెనుక శత్రఘ్నుడతిపత్రములు పట్ట,
2. హరి వెనుక శత్రఘ్నుడతిపత్రములు పట్ట,
శరాణార్ధులై విభీషణ సుగ్రీవులు కొలువా,
పరమభక్తుడు అంగదుడు, గజ గవాక్షుండు మొదలుగా
వరుస సేనుండాది గాగల పరమేష్ఠింపుచుండగ
||శ్యామ||
3. గిరిజా,శంభుడు, వాణీ పరమేష్టి సేవింప,
3. గిరిజా,శంభుడు, వాణీ పరమేష్టి సేవింప,
సురులు ఆనందించి, కుసుమ వృష్టి గురియింపగ,
భరద్వాజ, వశిష్ట, ముఖిభవ తీర్థ జలాభిషేకములు
కరుణతో సేయుమని నుతియింప కనకమణి సింహాసనంబున
||శ్యామ||
4. ధణ ధణ ధ్వనీ నాధత్రయములు మ్రోగగా
వీణాగానము ఆ నారదముని పాడగ,
ధణ ధణాంకిట, కింకిణులతో, మేనకా, రంభలతో,
ధాంతకిటకిటతోంతయాయని నటియింపుచుండగ
||శ్యామ||
5. వారి వామాంకమున భూమిజనుతనుగూడి
5. వారి వామాంకమున భూమిజనుతనుగూడి
మెడనున్న ముత్యాల హారము తీసియా,
వాయునందను చేర బిలిచియు నీవు చేసిన మేలు కొఱకై
హారముని గైకొనమటంచును, ప్రేమచే యురమునను వేయగా
||శ్యామ||
6. ఖిండితారపుడా కోదండార్చిత పూజ్యుడై
ఛండ ఖాండనమున, సరసీజాములు బట్ట,
పుండరీకాక్షుండు, శ్రీ రాముండు కూర్చుండ
వేముల కొండకోయని, బొడ్డు మల్లెలదండను మెడనిండ వేయగా
||శ్యామ||
7. పచ్చనక్షింతలు పరమాత్ముడు చేబూని
7. పచ్చనక్షింతలు పరమాత్ముడు చేబూని
పడతీ సీతా శిరసుపై బోసిరి వేగ,
అష్టదిక్పాలకుల భార్యలు, అరుంధతీ, అనసూయ మొదలుగ,
వారందరును వజ్రాల హారతులిచ్చిరి వధువరులకప్పుడు ||శ్యామ||
No comments:
Post a Comment