Tuesday, December 29, 2015

శ్రీ మల్లిఖార్జున స్వామి పాట




బలేందుమౌళి నీ పాలపడితినీ,   
నన్ను పాలింప జాగేల బాలసుందరిలోల ||బలేందు||

1. ఫలన్నయి త్రీశూల పాణి, కపాల హస్త సురాళి ,
వందిత బేలనై యిటున్న గోలచెంది మొరాలకింపవదేలనయ్యా ||బలేందు||

2. సురులు దానవులు క్షీరపయొధీ తరువా,
 భికరమైన ధ్వనులచే గరళమోద్భవమొంద, 
పురములన్నియు గాల్ప గానో హరి పరాత్పరయనచు వేడగ, 
గరళమును భక్షించి యా సురవరుల బ్రోచిన హరుడ వీవే ||బలేందు||

3. తిన్నప్ప మున్ను త్తిష్ఠాన్న మివ్వగలేదా, 
పన్నుడవై మెచ్చి అతని భక్తిని కోరి, 
కన్నులందు జలంబు గార్పగ అన్న శంభోయనచు వేడగ 
కన్నులిచ్చి మెచ్చి నీ సాన్నిధ్యమున నిలుపలేదా ||బలేందు||

4. నంది వాహనమెక్కి బృందారకులు గొలువ
 సుందరేశ్వర కొండలందు తిరిగెదవేల, 
ఇందు దినకర వహ్ని నయన ముకుంద పూజిత పాదయుగళ 
సంధియంబులు దీర్చి నా హృత్మందిరంబున నిలుపలేదా ||బలేందు||

5. కైలాస నిలయ నీ లీలలన్నియు తెలియ, 
జాలరెంతటి వారు శైలజ ప్రియనాథా, 
బాలుడైన మృకండ శూరుడు కాలులను, భయమోంది వేడగ 
జాలి చెంది మొరాలకించి చిరాయువిచ్చిన హరుడవీవే
|| బలేందు ||

6. అంబుజాసనుడు నిశ్చంబు నీ దరిచేర, 
శంభో హరే యనచు సేవ చేయుచునుండ, 
అంబరంబున నుండి నిను జంబాది ప్రముఖులు నుతులు చేయ 
జగంబులను పాలింపవా జగదాంబతో శ్రీ శంభులింగా 
|| బలేందు ||

7. గంగా శిరమునను అర్థాంగియై సతియుండ 
పొంగుచు తిరిగేవు సంగారహితుడా వయ్యా 
అంగజారి పురాంత కాశా రంగధర వల్లూరి పురవర, 
మల్లిఖార్జున లింగ శ్రీ భ్రమరాంబికా చితాత్మబృందా
 || బలేందు ||


No comments:

Post a Comment